BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 25 June 2026, 10:41 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బస్సులో సీటు కోసం మహిళల మధ్య ఘర్షణ.. జుట్టు పట్టుకుని కొట్టుకున్న ఘటన వైరల్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 10:41 AM
132 వీక్షణలు

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళల మధ్య జరిగిన ఘర్షణ కలకలం రేపింది. మధిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మధిర నుంచి ఖమ్మం వెళ్తుండగా వైరా మండలం పాలడుగు గ్రామ సమీపంలో ఓ కుటుంబం బస్సు ఎక్కింది. ఈ సమయంలో ఆ కుటుంబానికి చెందిన ఓ మహిళ సీటు కోసం ఇతర మహిళా ప్రయాణికులతో వాగ్వాదానికి దిగింది.

మాటామాటా పెరగడంతో వివాదం తీవ్రరూపం దాల్చి మహిళలు ఒకరినొకరు తోసుకుంటూ జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. బస్సులోని ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకుని వారిని విడదీశారు. ఈ ఘటనతో కొంతసేపు బస్సులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగిందని, సీట్ల కోసం తరచూ ఇలాంటి వాగ్వాదాలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.