BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 15 February 2026, 11:35 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

మల్లికార్జున స్వామికి వైభవంగా పాగాలంకరణ

తెలంగాణ
15 Feb, 2026 - 11:35 PM
289 వీక్షణలు
  శ్రీశైలంలో మల్లికార్జున స్వామికి వైభవంగా పాగాలంకరణ NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో మల్లికార్జున స్వామికి పాగాలంకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. లింగోద్భవకాల మహారుద్రాభిషేకం ప్రారంభమైన అనంతరం పాగాలంకరణ ఆచారం సంప్రదాయబద్ధంగా కొనసాగింది. బ్రహ్మోత్సవాల్లో జరిగే ఈ పాగాలంకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వివాహ వేడుకల్లో వరుడికి తలపాగ చుట్టే సంప్రదాయానికి ప్రతీకగా ఈ ఆచారం కొనసాగుతోంది. గర్భగుడి విమాన శిఖరం నుంచి ముఖ మండపంలోని నందివిగ్రహాల వరకు పాగాను అనుసంధానం చేస్తూ అలంకరించడం ఈ కార్యక్రమంలోని విశిష్టతగా భావించబడుతుంది. భక్తులు నియమ నిష్ఠలతో సంవత్సరంలో 365 మూరల పొడవుతో పాగాను నేస్తారు. పాగాలను అలంకరించే వ్యక్తి దిగంబరంగా సేవ నిర్వహించాల్సి ఉండటంతో, ఆ సమయంలో ఆలయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. సంపూర్ణ చీకటిలో ఈ అలంకరణ చేయడం విశేష నైపుణ్యంతో కూడుకున్నదిగా భావించబడుతుంది. రాత్రి 10 గంటల నుంచి ప్రకాశం జిల్లా చీరాల మండలం హస్తినాపురం గ్రామానికి చెందిన పృథ్వీ సుబ్బారావు స్వయంగా తెచ్చిన పాగాతో పాటు భక్తులు సమర్పించిన పాగాలను స్వామివారికి అలంకరించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. #Srisailam #MallikarjunaSwamy #Pagalankarana #Mahashivaratri2026 #TempleTradition Follow us on Website Facebook Instagram YouTube