BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 01 May 2026, 02:04 pm
Posted by : V శ్రీనివాస్

మంచిర్యాలలో ఘనంగా మే డే ప్రైవేట్ విద్యాసంస్థల సిబ్బంది హక్కుల కోసం ఐక్యపోరాటం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
01 May, 2026 - 02:04 PM
154 వీక్షణలు

​మంచిర్యాలలో ఘనంగా మే డే ప్రైవేట్ విద్యాసంస్థల సిబ్బంది హక్కుల కోసం ఐక్యపోరాటం

మంచిర్యాల: కార్మిక హక్కుల సాధనకు పోరాటమే ఏకైక మార్గమని తెలంగాణ ప్రైవేట్ విద్యాసంస్థల బస్సు డ్రైవర్ల సంఘం పిలుపునిచ్చింది. మే డే సందర్భంగా మంచిర్యాలలోని గాంధీ పార్క్ వద్ద సంఘం మే డే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు టి. జైపాల్ సింగ్ మాట్లాడుతూ... 140 ఏళ్ల క్రితం 1886లో అమెరికాలోని చికాగోలో కార్మికుల రక్తతర్పణం ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చిందని, అదే స్ఫూర్తితో నేటి కార్మికులు తమ హక్కుల కోసం పోరాడాలని కోరారు.

​ప్రస్తుతం ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న డ్రైవర్లు, క్లీనర్లు, అటెండర్లు, ఆయాలు, సెక్యూరిటీ గార్డులు చాలీచాలని జీతాలతో, జీవో ప్రకారం వేతనాలు అందక కుటుంబ పోషణ భారమై ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కుల మాదిరిగానే, ఇప్పుడు కూడా ఐక్యంగా ఉండి హక్కుల కోసం పోరాడాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి శేఖర్, ఉపాధ్యక్షులు మల్లేష్, కమిటీ సభ్యులు వెంకటేశ్వరావు, చంద్రయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు