BREAKING
శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష
Date of Publish : 20 July 2026, 08:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మండలంలో తృతీయ స్థానం సాధించిన విద్యార్థికి 'షైనింగ్ స్టార్స్' అవార్డు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jul, 2026 - 08:16 PM
77 వీక్షణలు

మండలంలో తృతీయ స్థానం సాధించిన విద్యార్థికి 'షైనింగ్ స్టార్స్' అవార్డు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న 'షైనింగ్ స్టార్స్' అవార్డుకు శ్రీవిద్య హై స్కూల్, ధర్మాజీగూడెంకు చెందిన విద్యార్థి పామర్తి ఫణి లిఖిత్ కుమార్ ఎంపికయ్యాడు.

2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో 577 మార్కులు సాధించి మండలంలో తృతీయ స్థానం పొందిన ఫణి లిఖిత్ కుమార్‌కు ఈ గౌరవం దక్కింది.

ఈ సందర్భంగా ఏలూరులోని సి.ఆర్. రెడ్డి కళాశాలలో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి చేతుల మీదుగా విద్యార్థికి 'షైనింగ్ స్టార్స్' అవార్డు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీవిద్య హై స్కూల్ డైరెక్టర్ సీహెచ్. రత్నాకర్ రావు, విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి సాధించిన ప్రతిభపై పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించింది.