BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 23 May 2026, 01:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మనవడి బర్త్‌డేను సేవా వేడుకగా మార్చిన యర్రా కుటుంబం..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 May, 2026 - 01:13 PM
226 వీక్షణలు

మనవడి బర్త్‌డేను సేవా వేడుకగా మార్చిన యర్రా కుటుంబం.. అన్నదానానికి లక్ష రూపాయల భారీ విరాళం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం పిఎసిఎస్ అధ్యక్షులు యర్రా ప్రసాదరావు కుటుంబం మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకుంది. మనవడు యర్రా గోవర్ధన్ తొలి పుట్టినరోజు సందర్భంగా ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నదాన ట్రస్ట్‌కు ఏకంగా రూ.1 లక్షల విరాళాన్ని అందజేసి అందరి ప్రశంసలు అందుకుంది.

సాధారణంగా పుట్టినరోజులు కేకులు, వేడుకలతో జరుపుకుంటారు. కానీ యర్రా కుటుంబం మాత్రం చిన్నారి గోవర్ధన్ జన్మదినాన్ని భక్తి, సేవాభావంతో ప్రత్యేకంగా నిలిపింది. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కన్నా గొప్ప దానం లేదనే భావనతో అన్నదాన ట్రస్ట్‌కు భారీ విరాళం అందించడం విశేషంగా మారింది.

ఈ కార్యక్రమంలో యర్రా ప్రసాదరావు దంపతులతో పాటు వారి కుమారుడు యర్రా నరేష్, కోడలు మౌనిక, కుమార్తె దివ్య పాల్గొన్నారు. చిన్నారి గోవర్ధన్‌కు ఆశీర్వాదాలు అందిస్తూ, ఈ కుటుంబం చేస్తున్న సేవా కార్యక్రమాలు మరెందరికో ఆదర్శమని స్థానికులు కొనియాడుతున్నారు.

“పుట్టినరోజు అంటే ఆనందం పంచుకోవాలి.. ఆ ఆనందం పదిమందికి ఉపయోగపడితేనే అసలైన సంతోషం” అనే సందేశాన్ని యర్రా కుటుంబం తమ సేవతో చాటిచెప్పిందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.