BREAKING
రామన్నపేటలో చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం ఉరుమడ్ల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి రామన్నపేటలో చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం ఉరుమడ్ల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి
Date of Publish : 10 September 2026, 02:27 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మరో కిడ్నీ బాధితురాలు మృతి.. ఏ.కొండూరులో ఆగని మూత్రపిండ వ్యాధి మరణాలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Sep, 2026 - 02:27 PM
2 వీక్షణలు

ఏ.కొండూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని ఏ.కొండూరు మండలంలో మూత్రపిండాల వ్యాధి మరో ప్రాణాన్ని బలిగొంది. కృష్ణారావుపాలెం గ్రామానికి చెందిన విస్సంపల్లి తేరేజమ్మ (65) కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ గురువారం ఉదయం మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఆమె కొంతకాలంగా ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు.

తేరేజమ్మ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమెకు ఇద్దరు సంతానం ఉన్నారు. అనారోగ్యానికి చికిత్స అందించేందుకు ఇప్పటివరకు సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేసినప్పటికీ తల్లిని కాపాడుకోలేకపోయామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

రోజురోజుకూ పెరుగుతున్న ఆందోళన

ఏ.కొండూరు మండలంలోని గిరిజన తండాలు, వివిధ గ్రామాల్లో మూత్రపిండాల వ్యాధి సమస్యపై ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే పలువురు బాధితులు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ డయాలసిస్‌పై ఆధారపడుతున్నారు. చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో బాధిత కుటుంబాలపై ఆర్థిక, మానసిక భారం పెరుగుతోంది.

ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి

ఏ.కొండూరు మండలంలో మూత్రపిండాల వ్యాధి సమస్యపై ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక దృష్టి సారించాలని సీపీఎం డిమాండ్ చేసింది. వ్యాధికి కారణాలను గుర్తించేందుకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించాలని, బాధితులకు నిరంతర వైద్య సేవలు అందించాలని కోరింది. డయాలసిస్ సేవలను స్థానికంగానే అందుబాటులోకి తీసుకురావడంతో పాటు బాధిత కుటుంబాలకు అవసరమైన వైద్య, ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేసింది.