మునుకుళ్ళ గ్రామంలో రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలం మునుకుళ్ల గ్రామంలో రీసర్వే ప్రక్రియ పూర్తైన నేపథ్యంలో రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను శనివారం రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. కుమార్ పంపిణీ చేశారు.
రైతులకు ఎటువంటి తప్పులు, పొరపాట్లు లేని భూ రికార్డులను అందించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల మంజూరు ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా మునుకుళ్ల గ్రామంలోని రైతుల భూములకు సంబంధించిన వివరాలను రీసర్వే ద్వారా పరిశీలించి, నమోదైన భూ వివరాల ఆధారంగా కొత్త పాస్‌పుస్తకాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆర్డీవో ఏ. కుమార్ మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి తప్పులు, పొరపాట్లు లేని భూ వివరాలతో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రీసర్వే ద్వారా భూముల సరిహద్దులు, విస్తీర్ణం, ఇతర వివరాలను స్పష్టంగా నమోదు చేశామని చెప్పారు. భవిష్యత్తులో రైతులకు భూ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.
కార్యక్రమంలో తిరువూరు తహసీల్దార్, గ్రామ పెద్దలు, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.