BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

నందవరం జ్యోతి వేడుకలకు వైద్య భద్రత

తెలంగాణ
09 Mar, 2026 - 02:22 AM
355 వీక్షణలు
నందవరం జ్యోతి వేడుకలకు వైద్య భద్రత భక్తుల కోసం ఎమర్జెన్సీ అంబులెన్స్, ప్రత్యేక వైద్య ఏర్పాట్లు NTODAY NEWS: నందవరం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున ఉగాది సందర్భంగా నందవరం క్షేత్రంలో నిర్వహించనున్న జ్యోతి వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో వైద్య భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎమర్జెన్సీ అంబులెన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఏడాది మార్చి 19 నుండి 25 వరకు జ్యోతి వేడుకలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా మార్చి 21, 22 తేదీల్లో జరిగే ప్రధాన కార్యక్రమాలకు సుమారు 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు భక్తులు నందవరం చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునేలా ఈ వేడుకలను రాష్ట్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో భక్తుల భద్రత, ఆరోగ్య పరిరక్షణ కోసం అధికారులు చర్యలు ప్రారంభించారు. నందవరం ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాస్ రెడ్డి జిల్లా సీనియర్ వైద్యులు డాక్టర్ హరినాథ్ రెడ్డితో చర్చలు జరిపినట్లు సమాచారం. భక్తులకు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే వైద్య సహాయం అందించేందుకు ప్రత్యేక ఎమర్జెన్సీ అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇటీవల మహానంది క్షేత్రంలో జరిగిన శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా డాక్టర్ హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి భక్తులకు వైద్య సేవలు అందించారు. అదే విధంగా నందవరం ఉగాది జ్యోతి వేడుకల్లో కూడా వైద్య సహాయం అందించాలని అధికారులు కోరారు. దీనిపై స్పందించిన డాక్టర్ హరినాథ్ రెడ్డి ఎమర్జెన్సీ అంబులెన్స్‌తో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే ఖరీదైన మందులను కూడా ఉచితంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా నంద్యాల పట్టణంలోని నంద్యాల క్రిటికల్ కేర్, ఇండస్, సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ ఆసుపత్రులకు చెందిన ఎమర్జెన్సీ వైద్యులు కూడా అవసరమైతే వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎమర్జెన్సీ అంబులెన్స్‌తో పాటు ప్రాథమిక చికిత్స కేంద్రం, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా దర్శనం చేసుకుని వెళ్లేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. #Nandavaram #JyothiFestival #NandyalDistrict #MedicalSupport #AmbulanceService #AndhraPradeshNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube