BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 02:47 pm
Posted by : PEDDABOINA SRIKANTH

ఎల్కతుర్తి బాలికల ఎస్సీ గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
17 Nov, 2026 - 02:47 PM
21 వీక్షణలు

హనుమకొండ జిల్లా | ఎల్కతుర్తి | నవంబర్ 17 (ఎన్ టుడే న్యూస్)

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని బాలికల ఎస్సీ గురుకుల పాఠశాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణం, విద్యార్థులకు అందిస్తున్న భోజనం, పరిసరాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ అన్నపూర్ణను కలిసి విద్యార్థులకు అందుతున్న విద్యా బోధన, వారి ఆరోగ్య పరిస్థితులు, పాఠశాలలో ఉన్న సదుపాయాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పాఠశాల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, విద్యార్థులకు అందిస్తున్న ఆహారంపై పరిశీలన చేసిన మంత్రి.. అన్ని అంశాలు సక్రమంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రిన్సిపాల్ అన్నపూర్ణను అభినందించారు. విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు వారి ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

ఇటీవల క్రీడా పోటీల్లో బహుమతులు సాధించిన విద్యార్థులను మంత్రి సన్మానించి అభినందించారు. ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో ఆంగ్లంలో మాట్లాడేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. చదువుతోపాటు క్రీడలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ విద్యార్థులను ప్రోత్సహించాలని తెలిపారు. తమ ప్రతిభతో రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకువచ్చేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు.

మంత్రి తమ పాఠశాలను సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందని ప్రిన్సిపాల్ అన్నపూర్ణ తెలిపారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల ప్రగతిపై మంత్రి చూపిన ఆసక్తి పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి ఓఎస్‌డీ తిరుపతితో పాటు స్థానిక నాయకులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.