BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 11 March 2026, 07:43 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మంచిర్యాలకు చేరుకున్న ‘మిషన్ హెల్తీ భారత్’ బృందం

తెలంగాణ
11 Mar, 2026 - 07:43 AM
464 వీక్షణలు
మంచిర్యాలకు చేరుకున్న ‘మిషన్ హెల్తీ భారత్’ బృందం విద్యార్థులకు ఒబేసిటీపై అవగాహన NTODAY NEWS: మంచిర్యాల ప్రతినిధి శ్రీనివాస్ ‘ఒబేసిటీ ముక్త్ భారత్’ (స్థూలకాయ రహిత భారత్) నినాదంతో దేశవ్యాప్తంగా పర్యటన చేపట్టిన ‘మిషన్ హెల్తీ భారత్’ బృందం బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులతో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకురాలు తాప్సీ ఉపాధ్యాయ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి ప్రసంగించారు. అధిక బరువు (ఒబేసిటీ) వల్ల కలిగే అనర్థాలు మరియు ఆరోగ్య సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆహార నియమాలపై సూచనలు ఒబేసిటీ రాకుండా ఉండాలంటే పరిమితంగా మరియు పౌష్టికాహారం తీసుకోవాలని తాప్సీ ఉపాధ్యాయ సూచించారు. జంక్ ఫుడ్‌ను తగ్గించి, సమతుల ఆహారాన్ని అలవాటు చేసుకోవాలని తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం మెరుగైన ఆరోగ్యానికి క్రమశిక్షణతో కూడిన ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రతిరోజూ వ్యాయామం, క్రీడలు, శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. దేశవ్యాప్త అవగాహన కార్యక్రమం దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. #MissionHealthyBharat #ObesityMuktBharat #HealthAwareness #Mancherial #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube