BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 15 November 2026, 06:48 pm
Posted by : PAGADALA DEVAIAH

కర్మన్ ఘాట్ పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
15 Nov, 2026 - 06:48 PM
24 వీక్షణలు

ఉత్తర భారతీయుల సాంస్కృతిక సంప్రదాయాలు దేశ సమగ్రతకు ప్రతీక – ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, నవంబర్ 15 / ఎన్ టుడే న్యూస్:

కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం ఆవరణలో ఉత్తర్ భారతి నాగరిక్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛట్ పూజ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజల్లో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి పూజా కార్యక్రమాలను తిలకించారు.

అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తర భారతీయ సోదర సోదరీమణులు సంప్రదాయబద్ధంగా ఆచరించే ఛట్ పూజ దేశ సమగ్ర సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. భిన్న ప్రాంతాలు, భాషలు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ భారతీయ సంస్కృతిలోని ఆధ్యాత్మిక విలువలు ప్రజలందరినీ ఒక్కటిగా నిలుపుతున్నాయని పేర్కొన్నారు.

సూర్యభగవానుడిని ఆరాధించే ఛట్ పూజకు ఎంతో విశిష్టత ఉందని, ఈ పర్వదినంలో భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి, పండ్లు తదితర నైవేద్యాలను సమర్పిస్తూ సూర్యుడికి కృతజ్ఞతలు తెలుపుతారని వివరించారు. ప్రకృతికి, సూర్యుడికి కృతజ్ఞతలు తెలియజేసే పవిత్రమైన ఆచారంగా ఈ పూజకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా సూర్యదేవుడి ఆరాధన, ఉషోదయ పూజల ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ భక్తులందరికీ ఆరోగ్యం, సుఖశాంతులు, కుటుంబ సౌభాగ్యం కలగాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ప్రార్థించారు.

ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో నివసిస్తున్న ఉత్తర భారతీయ ప్రజలు తమ సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భరోసా ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజలు తమ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకుంటూ ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం మాజీ ధర్మకర్త మధుసాగర్, ఆలయ సిబ్బంది ప్రసాద్, ఉత్తర్ భారతి నాగరిక్ సంఘ్ సభ్యుడు ఎన్.కే. సింగ్, సంఘ్ పరివార్ కుటుంబ సభ్యులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.