BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 19 November 2025, 09:53 am
Posted by : NTODAY NEWS OFFICIAL

దేశ ప్రజలకు అమ్మ భారత రత్న ఇందిరమ్మ

తెలంగాణ
19 Nov, 2025 - 09:53 AM
332 వీక్షణలు
దేశ ప్రజలకు అమ్మ భారత రత్న ఇందిరమ్మ NTODAY NEWS: పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావిపాటి రాజా.. చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టి. ప్రతి భారతీయుడికి కనీస జీవన అవసరాలు అయిన కూడు, గూడు, గుడ్డ అందించడం ద్వారా కోట్లాదిమంది ప్రజల తోటి ఆప్యాయంగా అమ్మ అని పిలిపించుకున్న ఏకైక నాయకురాలు భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ అని పల్నాడు జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ కన్వీనర్ కల్యాణం రాఘవయ్య అన్నారు. భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమం చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త. ఎం.రాధాకృష్ణ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాఘవయ్య మాట్లాడుతూ హరిత విప్లవ సాధన ద్వారా దేశ ప్రజల ఆకలి తీర్చడంతో పాటు దేశాన్ని అన్నపూర్ణమ్మ గా తీర్చిదిద్దిన మహా నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ అని అన్నారు. రైతు, రైతు కూలీలను రెండు కళ్ళుగా భావించి వ్యవసాయ రంగ అభివృద్ధికి బంగారు బాటలు వేసిన చిరస్మరణీయురాలు ఇందిరమ్మ అని అన్నారు. నాదెండ్ల మండల కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ బాజీ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల సంక్షేమం, రక్షణ రెండు కళ్ళుగా భావించిన నేత శ్రీమతి ఇందిరా గాంధీ అని అన్నారు. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశం కావడంలో కీలక పాత్ర పోషించి ప్రపంచ ప్రజలతో అపర కాళిక అని, ధీర నాయకురాలని ప్రశంసలందుకున్నారని యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంటూరి భవాని వెంకటేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే శ్రీమతి ఇందిరా గాంధీకి మనమర్పించే జయంతి కానుక అని కిసాన్ సెల్ నాయకుడు పేరేచర్ల రాఘవ రాజు అన్నారు. ఇందిరా గాంధీ చిత్రపటానికి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చే రెడ్డి శ్రీరామ్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎర్రగళ్ల రవి ,షేక్ బాజీ ఎడ్లపాడు , నాదెండ్ల మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు సాగి నరసింహారావు షేక్ బాజీలు పూలమాలలు వేసి జయంతి జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎం రాధాకృష్ణ రాష్ట్ర కాంగ్రెస్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ నసురుద్దీన్ పల్నాడు జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు కల్యాణం రాఘవయ్య జిల్లా కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఎరగళ్ళ రవి షేక్ బాజీ నాదెండ్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ బాజీ ఎడ్లపాడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సాగి నరసింహారావు యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంటూరి భవాని వెంకటేష్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కారుచోల స్వప్న కుమార్ జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి నాగేశ్వరరావు కిసాన్ సెల్ నాయకులు పేరేచర్ల రాఘవ రాజు బిసి నాయకులు అన్నపు రెడ్డి వెంకటేశ్వర్లు, ఉప్పు తోళ్ళ గోపి, షేక్ సునీల్ బాబు తాళ్లూరి రామారావు వేముల ఆంజనేయులు సిద్ధాబత్తుని రామకోటేశ్వరరావు గోపి, కాంగ్రెస్ నాయకులు దాసరి శ్యాం బాబు అల్లం సుబ్బారావు ఎస్సీ నాయకులు దావల యోసేపు, సి హెచ్ విక్టోరియా రాణి మొగిలి లక్ష్మి లేవీ, మైనారిటీ నాయకులు షేక్ గౌస్ ఎస్టీ విభాగం నాయకులు కేతావత్ సాంబశివ నాయక్ కేతవత్ భీమా నాయక్ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube