విశ్వకర్మ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్
తెలంగాణ
/
జగిత్యాల
ధర్మపురి,
ధర్మపురి పట్టణ కేంద్రంలోని విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో గురువారం విశ్వకర్మ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని, స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ పట్టణంలోని విశ్వకర్మ సామాజిక వర్గ ప్రజలందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజ నిర్మాణంలో విశ్వకర్మ బంధువుల శ్రమ, కళానైపుణ్యం ఎంతో విలువైనవని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం ధర్మపురి పట్టణ అధ్యక్షుడు సింహారాజు ప్రసాద్ గారు, సంఘం ప్రతినిధులు, సభ్యులు మరియు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.