BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 12 February 2026, 09:09 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మున్సిపల్ కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహించాలి:

తెలంగాణ
12 Feb, 2026 - 09:09 AM
382 వీక్షణలు
మున్సిపల్ కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ హనుమంతరావు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కౌంటింగ్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కౌంటింగ్ ఎన్నికలలో అత్యంత కీలక దశ అని పేర్కొన్న కలెక్టర్, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రాథమిక మరియు వివరణాత్మక లెక్కింపును నిర్వహించాలని సూచించారు. రూల్ 56 ప్రకారం ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును పూర్తి చేయాలని తెలిపారు. యాక్ట్ 212 ప్రకారం సీక్రెసీ మెయింటెనెన్స్ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ నిర్వహించాలన్నారు. ప్రతి బ్యాలెట్ పేపర్‌ను కౌంటింగ్ ఏజెంట్లకు చూపించి, సంబంధిత సీల్ ట్రేలో సక్రమంగా వేయాలని స్పష్టం చేశారు. మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా సాగాలని సూచించారు. అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రతి టేబుల్‌కు ఒక సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు నియమిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం లెక్కింపును పూర్తి చేసి, ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్లు నర్సిరెడ్డి, హరినాథ్ రెడ్డి, కౌంటింగ్ సిబ్బంది పాల్గొన్నారు. #YadadriBhuvanagiri #MunicipalElections #VoteCounting #ElectionTraining #TelanganaNews #DistrictAdministration #LocalNews Follow us on Website Facebook Instagram YouTube