BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 26 January 2026, 09:24 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం

తెలంగాణ
26 Jan, 2026 - 09:24 AM
219 వీక్షణలు
తొర్రూరులో రూ.15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు భారీ బైక్ ర్యాలీ, మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం NTODAY NEWS: పాలకుర్తి రిపోర్టర్: వేణు తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య కూడా పాల్గొన్నారు. అనంతరం సుమారు 1000 బైకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, ప్రజల మధ్య ఉత్సాహాన్ని నింపారు. తర్వాత BR కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన తొర్రూరు పట్టణ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ నిరంతరం అభివృద్ధి పనులు చేపడుతోందని తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందని పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేందుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయక్, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #Palakurthi #Torrur #DevelopmentWorks #CongressParty #MunicipalElections #BikeRally #TelanganaPolitics #PublicMeeting Follow us on Website Facebook Instagram YouTube