BREAKING
thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి thumb ● ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు thumb ● పల్నాడు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● బీరంగూడలో హంపి షాపింగ్ మాల్ ప్రారంభం thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి thumb ● ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు thumb ● పల్నాడు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● బీరంగూడలో హంపి షాపింగ్ మాల్ ప్రారంభం
Date of Publish : 02 October 2026, 05:35 pm
Posted by : SEETHA KIRAN KUMAR

వివాహేతర సంబంధానికి అడ్డుగా భర్త.. భార్య, ప్రియుడిపై హత్య కేసు

తెలంగాణ
/ జయశంకర్ భూపాలపల్లి
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
02 Oct, 2026 - 05:35 PM
7 వీక్షణలు

భూపాలపల్లి: జిల్లాలోని బుద్ధారంలో పెండల సంపత్ (32) హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో సంపత్‌ను అతడి భార్య సుమలత, ఆమెతో సంబంధం ఉన్న ఉమ్మల శ్రీకాంత్ కలిసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం.

పోలీసుల వివరాల ప్రకారం.. సంపత్‌ను మద్యం తాగేందుకు పిలిచి, తరుణ్ సహకారంతో మద్యంలో పురుగుల మందు కలిపి తాగించినట్లు గుర్తించారు. అనంతరం సంపత్ మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు.

మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు. సుమలత, శ్రీకాంత్‌తో పాటు ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఇతర నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, నిందితుల పాత్రపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.