BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 30 August 2026, 06:08 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నారాయణపురంలో సహకార సంఘం గోదాం ప్రారంభం.. అంతర్గత రోడ్లకు శంకుస్థాపన

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 06:08 PM
60 వీక్షణలు

1000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించిన గోదాం ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

బోనకల్లు, ఖమ్మం జిల్లా: రైతుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజా పాలనలో ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

మధిర నియోజకవర్గం బోనకల్లు మండలం నారాయణపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన 1000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన సహకార సంఘం గోదామును ఆదివారం ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో భాగంగా గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

అనంతరం నారాయణపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో రూ.63 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కరివేద సుధాకర్ ఆధ్వర్యంలో రైతులు, గ్రామ ప్రజలు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.