BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 15 November 2026, 04:02 am
Posted by : K MAHESH

నేచర్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన సర్పంచ్ యమునా సుమన్ నాయక్

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
15 Nov, 2026 - 04:02 AM
16 వీక్షణలు

నారాయణపురంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు.. ప్రతి గ్రామంలో పచ్చదనం పెంపొందించడమే లక్ష్యమన్న ట్రస్ట్ చైర్మన్ బండారు వెంకటరమణ

కేసముద్రం: పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా మహబూబాబాద్‌కు చెందిన నేచర్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ధరావత్ యమునా సుమన్ నాయక్, నేచర్ కేర్ ట్రస్ట్ చైర్మన్ బండారు వెంకటరమణ ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో వాహనాల సంఖ్య పెరగడం, పరిశ్రమల విస్తరణ కారణంగా పర్యావరణ కాలుష్యం తీవ్రతరం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు అడవులు తగ్గిపోవడం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోందని, వర్షాభావ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం పెరుగుతోందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో వంటి పరిణామాలు కూడా పర్యావరణంపై ప్రభావం చూపుతున్నాయని వివరించారు.

ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా విరివిగా మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. నేచర్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లో సాధ్యమైనన్ని మొక్కలు నాటుతూ పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు తోట లాలయ్య, మడత వెంకన్న, గ్రామ వార్డు సభ్యులు గుగులోత్ లచ్చు, జె. వీరన్న, అశోక్, భక్ష కన్య, గ్రామ పెద్దలు లక్ష్మీపతి, సోమిరెడ్డి, కీమా, రామ్మూర్తి, సుమన్, ఫీల్డ్ అసిస్టెంట్ సురేష్, అనిత, ఉపేందర్, శ్రీకాంత్, మధు, సురేష్, రవి, అంగన్‌వాడీ సిబ్బంది జ్యోతి, సునీత, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.