BREAKING
thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ
Date of Publish : 12 May 2026, 07:31 pm
Posted by : కూనురు మధు

నీట్‌ విద్యార్థులకు న్యాయం చేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
12 May, 2026 - 07:31 PM
235 వీక్షణలు

నీట్‌ విద్యార్థులకు న్యాయం చేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌   NTODAY NEWS చిట్యాల 

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ  నిర్వహిస్తున్న నీట్‌ పరీక్షల్లో వరుసగా చోటుచేసుకుంటున్న అవ్యవస్థలు, పేపర్ లీకేజీలు దేశవ్యాప్తంగా ఉన్న 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షులు అరూరి ప్రణీత్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ​పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు అప్పులు చేసి, నగలు అమ్మి తమ పిల్లలను చదివిస్తుంటే, ఎన్‌టీఏ నిర్లక్ష్యం వల్ల వారి కలలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి అని పేర్కొన్నారు. పదేపదే వైఫల్యాలకు గురవుతున్న ఎన్‌టీఏను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ​నీట్ పేపర్ లీకేజీలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని,  ​బాధిత 22 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చెయ్యాలి అని డిమాండ్ చేశారు. ​భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అత్యున్నత భద్రతా ప్రమాణాలతో కూడిన,  పరీక్షా విధానాన్ని  తీసుకురావాలని ప్రభుత్వానికి హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఈ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ సమాధానం చెప్పాలని అరూరి ప్రణీత్ డిమాండ్ చేశారు.