BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 26 August 2026, 03:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నెమలి వేణుగోపాలస్వామి దేవస్థానంలో సెప్టెంబర్ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Aug, 2026 - 03:20 PM
62 వీక్షణలు

నెమలి వేణుగోపాలస్వామి దేవస్థానంలో సెప్టెంబర్ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

నవనీత కృష్ణ అలంకారంలో దర్శనమివ్వనున్న స్వామివారు.. ఉట్టి ఉత్సవానికి ఏర్పాట్లు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం నెమలి శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్వామివారు "నవనీత కృష్ణ" అలంకార రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ ఈవో సంధ్య తెలిపారు. సాయంత్రం వేళ సంప్రదాయబద్ధంగా ఉట్టి ఉత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో గోపూజ, వేణుగోపాలస్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా స్వామివారికి తొమ్మిది రకాల ప్రసాదాలను నివేదించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు టి.గోపాలచార్యులు వివరించారు.

అదేవిధంగా సెప్టెంబర్ 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు దేవస్థానంలో పవిత్రోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ అధికారులు కోరారు.