BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

నగదు బదిలీ పథకాన్ని కొనసాగించాలి GMPS జిల్లా కార్యదర్శి దయ్యాల నరసింహ.

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
21 Mar, 2026 - 06:29 PM
26 వీక్షణలు

నగదు బదిలీ పథకాన్ని కొనసాగించాలి  GMPS జిల్లా కార్యదర్శి దయ్యాల నరసింహ.

గొర్ల కాపరుల సంక్షేమానికి బడ్జెట్లో  పదివేల కోట్లు కేటాయించాలి.నగదు బదిలీ పథకాన్ని కొనసాగించాలి.జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి దయ్యాల నరసింహ. నవ తెలంగాణ భువనగిరి కలెక్టరేట్ గొర్రెల పెంపకం దారుల  సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో పదివేల కోట్లు కేటాయించాలని, దళారుల  ప్రమేయం లేకుండా నగదు బదిలీ ద్వారా రెండో విడత రెండు లక్షల రూపాయలతో   గొర్ల పంపిణీ చేపట్టాలని  గొర్రెల మేకల పెంపకం దార్ల సంఘం జిల్లా కార్యదర్శి దయ్యాల నరసింహ కోరారు. శనివారం జిఎంపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి   వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి  వచ్చిన తర్వాత గొర్రెల పెంపకం దారుల సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదని, గత ప్రభుత్వం  అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకాన్ని అవినీతి సాకుతో  నిలిపివేయడం సరికాదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన రెండు లక్షల రూపాయల నగదు బదిలీ ఊస ఎత్తడం  లేదని,  పశుసంవర్ధక   శాఖకు సరిపడ నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, వెంటనే పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.  జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రమాదాలలో ప్రతిరోజు వందలాది గొర్రెలు మృత్యువాత పడుతున్నాయని, వీటికి నష్టపరిహారం అందజేయాలని కోరారు. మేత వనరులు తగ్గిపోతున్నాయని, వెంటనే మేత వనరులకు కొరకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. పశువైద్యశాలలో మందులు సరిగా లేకపోవడంతో జీవాలకు కనీస వైద్యం అందడం లేదని, గొర్రెల పెంపకం దారుల సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని కోరారు.  కర్ణాటక తరహాలో గొర్ల కాపరులకు రక్షణ చట్టాన్ని తేవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గొర్రెలు మేకలకు ప్రభుత్వం ఉచితంగా ఇన్సూరెన్స్ చేయించాలని, పశు వైద్యశాలలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా, ప్రతి మూడు నెలలకు ఒకసారి నాణ్యమైన నటల మందులు ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు. ప్రతి గ్రామంలో సామూహిక గొర్రెల షెడ్ల నిర్మాణం చేసి, ఎండాకాలం దృశ్య   నీటితోట్లు నిర్మించాలన్నారు. సబ్సిడీ మీద జీవాలకు దాన గడ్డి గింజలు సరఫరా చేసి, గొర్రెల మేతకు వెళ్తున్న కాపర్లపై ఫారెస్ట్ అధికారుల వేధింపులు అరికట్టాలని కోరారు. 50 సంవత్సరాలు దాటిన గొర్రెల కాపరులకు నెలకు 5000 పెన్షన్ ఇవ్వాలని, వివిధ ప్రమాదాలలో చనిపోతున్న గొర్రెల కాపరులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు.  సొసైటీలకు కొత్త జిల్లాల ప్రాతిపదికన జిల్లా యూనియన్లు ఏర్పాటు చేసి, జిల్లావ్యాప్తంగా ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించాలని నరసింహ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గొర్రెల మేకల పెంపొందారుల సంఘం జిల్లా అధ్యక్షులు మద్దెపురం రాజు, జిల్లా ఉపాధ్యక్షులు బుడుమ శ్రీశైలం, సహాయ కార్యదర్శి ఎల్లంల సత్యనారాయణ, కొండే శ్రీశైలం, నారి వెంకటేష్,  జిల్లా కమిటీ సభ్యులు మన్నేబోయిన రాజ లింగం,పాక జహంగీర్, కడెం బీరప్ప, జోగు శ్రీనివాస్, ఎర్రోళ్ల ఉపేందర్, మేడబోయిన యాదగిరి, లంకల యాదయ్య,  బీనబోయిన జంగయ్య,  మల్లె బోయిన మల్లయ్య, అవిశెట్టి పాండు,  జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.