BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 23 August 2026, 06:32 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నూజిళ్లపల్లిలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు అడ్డంకులా?

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:32 AM
34 వీక్షణలు

నూజిళ్లపల్లిలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు అడ్డంకులా? పోరాటంతో సాధించుకుంటాం: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

ప్రకాశం జిల్లా పంగులూరు మండలం నూజిళ్లపల్లి గ్రామంలో పర్యటన

ప్రకాశం జిల్లా పంగులూరు మండలం నూజిళ్లపల్లిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు అధికారులు ఆంక్షలు విధించడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం ప్రజల హక్కు అని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఐక్యంగా పోరాడి సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

నూజిళ్లపల్లి దళిత కాలనీలో శనివారం పర్యటించిన శ్రీనివాసరావు.. దళితులతో సమావేశమయ్యారు. కాలనీ రోడ్డు ప్రారంభంలో అంబేద్కర్ విగ్రహం, ఆర్చిని ఏర్పాటు చేసుకోవాలన్నది న్యాయమైన కోరిక అని పేర్కొన్నారు. విగ్రహ ఏర్పాటుకు ప్రయత్నించిన సమయంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకుని విగ్రహాన్ని పంగులూరు తహశీల్దార్ కార్యాలయానికి తరలించడం దురదృష్టకరమన్నారు.

అధికారులు స్పందించాలి

అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్న స్థలం ప్రభుత్వ స్థలమని, ఎవరి వ్యక్తిగత స్థలంలోనూ ఏర్పాటు చేయాలని కోరడం లేదని శ్రీనివాసరావు తెలిపారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి అదే ప్రదేశంలో విగ్రహ ఏర్పాటుకు అనుమతించాలని డిమాండ్ చేశారు.

గ్రామాలు, పట్టణాల్లో అనేక మంది నాయకుల విగ్రహాలు, ఆర్చీలు ఉన్నాయని, వాటికి ఎలాంటి విధానాలు పాటించారో చెప్పాలని ప్రశ్నించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మహిళా హక్కులు, భూ హక్కులు, రైతాంగ హక్కుల కోసం పోరాడారని, అలాంటి మహనీయుడి విగ్రహం కోసం అనుమతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు.

దళితుల ఆత్మగౌరవ సమస్య

దళితులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించడం, విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడం వంటి ఘటనలపై జిల్లా అధికారులు స్పందించకపోవడం సరికాదన్నారు. దీని వెనుక పెత్తందారుల ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపించారు.

కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు సమస్యను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని విమర్శించారు. ఇది కేవలం విగ్రహ సమస్య కాదని, దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని అన్నారు.

ఈ నెల 24న ఒంగోలులో నిర్వహించే చలో కలెక్టరేట్ కార్యక్రమంలో దళితులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని శ్రీనివాసరావు కోరారు.

కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ మాబు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు కంకణాల ఆంజనేయులు, ఐద్వా నాయకురాలు కంకణాల రమాదేవి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి బి.రఘురాం తదితరులు పాల్గొన్నారు.