BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 07 April 2026, 07:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నూజివీడు నియోజకవర్గ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లుగా

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Apr, 2026 - 07:14 PM
437 వీక్షణలు

నూజివీడు నియోజకవర్గ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లుగా చాట్రాయి మండలం నుంచి అత్తులూరి శ్రీనివాసరావు, నక్కా సితారత్నం ఎంపిక

నూజివీడు (ఏలూరు జిల్లా): నూజివీడు నియోజకవర్గ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లుగా చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత, సీనియర్ అడ్వకేట్ అత్తులూరి శ్రీనివాసరావు మరియు చనుబండ గ్రామానికి చెందిన నక్కా సితారత్నం ను ఎంపిక చేసినట్లు సమాచార శాఖ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ప్రకటించారు. ఈ నిర్ణయంతో నూజివీడు నియోజకవర్గం ఆర్యవైశ్య, దళిత సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, అత్తులూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ, "మంత్రి కొలుసు పార్థసారధి  తనపై నమ్మకంగా పెట్టిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చుకుంటానని" తెలిపారు. "ఈ పదవి ఇచ్చినందుకు మంత్రి కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అన్నారు. నక్కా రాము మాట్లాడుతూ తనకు ఈ గౌరవం ఇచ్చి తన మాతృ మూర్తి కి ఈ పదవి ఇచ్చినందుకు మంత్రి కి రుణపడి ఉంటానని చెప్పారు. ఈ నియామకానికి చనుబండ పంచాయతీ నుండి పిఎసిసిఎస్ అధ్యక్షులు మోరంపూడి శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు చీదిరాల మారేశ్వర రావు, మాజీ ఎంపీపీ కందుల కృష్ణ, ములగలపాటి శ్రీనివాస రావు, బొట్టు దుర్గారావు, బొంతు సతీష్, మోరంపూడి రమేష్, దార్ల సురేష్ బాబు, మోద్గా ముత్తయ్య, గౌర వెంకటేశ్వరరావు, నక్కా చెన్నారావు తదితర టీడీపీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నియామకం, నూజివీడు నియోజకవర్గంలో సక్రమమైన పాలన మరియు దళితుల హక్కుల పరిరక్షణలో కీలక మార్గదర్శిగా నిలిచే అవకాశం ఉంది.