BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 29 March 2026, 03:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నూజివీడులో మనసులో మాట 132వ ఎపిసోడ్ వీక్షణ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 03:48 PM
261 వీక్షణలు

నూజివీడులో ‘మనసులో మాట’ 132వ ఎపిసోడ్ వీక్షణ కార్యక్రమం

నూజివీడు: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న ‘మనసులో మాట’ (మన్ కీ బాత్) 132వ ఎపిసోడ్‌ను నూజివీడులో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పనతల సురేష్, ఏలూరు జిల్లా అధ్యక్షుడు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శ్రీకర్ బుర్రి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.

నూజివీడులోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల మరియు హాస్టల్‌లో 8, 9వ తరగతి బాలికలతో కలిసి టీవీ ద్వారా కార్యక్రమాన్ని వీక్షించారు.

ఈ సందర్భంగా శ్రీకర్ బుర్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. విద్య కేవలం పుస్తక జ్ఞానంగా కాకుండా జీవన నైపుణ్యాలను పెంపొందించే సాధనంగా ఉండాలని అన్నారు. స్కిల్ ఇండియా ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం, సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం, మాతృభాషలో విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం, డిజిటల్ మరియు ఆన్‌లైన్ విద్యను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం వంటి అంశాలను ప్రస్తావించారు.

విద్యార్థులు కేవలం మార్కులకు మాత్రమే పరిమితం కాకుండా క్రీడలు, కళలు, నైతిక విలువలు, టెక్నాలజీ పరిజ్ఞానం వంటి విభిన్న రంగాల్లో అభివృద్ధి చెందాలని తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణానికి విద్యారంగమే పునాది అని చెప్పారు.

పాఠశాల ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ, ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11:30 గంటలకు అన్ని తరగతుల బాలికలకు ఎల్ఈడి స్క్రీన్‌లపై ‘మనసులో మాట’ కార్యక్రమాన్ని చూపిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులకు సాధారణ జ్ఞానం ప్రశ్నలు అడిగి బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో చాగంటి వాసుదేవరావు, వసుంధర దేవి, మాగంటి వాసుదేవరావు దంపతులు, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు టి రాజేంద్ర ప్రసాద్, నూజివీడు టౌన్ ప్రధాన కార్యదర్శులు జగదీష్, సూర్యప్రకాశ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు, బాలికలు పాల్గొన్నారు.