BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 17 February 2026, 08:01 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహణ

తెలంగాణ
17 Feb, 2026 - 08:01 PM
198 వీక్షణలు
అడవినాథునికుంటలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహణ NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్ర రాజు పుంగనూరు: మండల పరిధిలోని అడవినాథునికుంటలో ఉన్న ఏపీ మోడల్ పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా హ్యాండ్ వాష్ కమ్ డెవర్మింగ్ డే కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆరోగ్యంగా ఉన్న 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు మధ్యాహ్న భోజనం అనంతరం ఆల్బెండాజోల్ మాత్ర పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఉన్న పిల్లలకు ఫిబ్రవరి 24, 2026న మాత్ర అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రైవేట్‌గా ఈ మాత్ర ధర రూ.25 కాగా, ప్రభుత్వ కార్యక్రమంలో ఉచితంగా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రక్తహీనత నివారణకు, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ఈ కార్యక్రమం ఉపయోగకరమని వైద్య సిబ్బంది తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు చేతుల శుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డా. పవన్ కుమార్, ఏపీ మోడల్ స్కూల్ కమిటీ చైర్మన్ సదా రెడ్డి, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ లోకనాథం, ఉపాధ్యాయులు, వైద్య మరియు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. #NationalDewormingDay #HealthAwareness #SchoolHealthProgram #AnnamayyaDistrict #Punganur #HandWashDay #PublicHealth #ChildCare Follow us on Website Facebook Instagram YouTube