BREAKING
thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి
Date of Publish : 15 September 2026, 01:37 pm
Posted by : DAVU RAVINDER REDDY

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జి?

జాతీయం
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
15 Sep, 2026 - 01:37 PM
15 వీక్షణలు

నేషనల్ / Ntoday News: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లనున్న తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ సుమారు 10 నెలల పాటు పార్టీ బాధ్యతలకు దూరంగా ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో తెలంగాణకు కొత్త ఇన్‌చార్జిని నియమించే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

కొత్త ఇన్‌చార్జి ఎంపిక కోసం పలువురు సీనియర్ నేతల పేర్లను పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముకుల్ వాస్నిక్, శక్తిసిన్హ్ గోహిల్, దిగ్విజయ్ సింగ్, అశోక్ గెహ్లాట్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ వ్యవహారాలను సమన్వయం చేసే సీనియర్ నేతను త్వరగా నియమించాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఇన్‌చార్జి ఎంపికపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చించిన అనంతరం తెలంగాణ కొత్త ఇన్‌చార్జిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై కాంగ్రెస్ అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.