NRI ఇంట్లో చోరీకి వెళ్లి.. గ్రిల్స్‌లో చిక్కుకున్న దొంగ
జాతీయం
జాతీయం
సూరత్ / Ntoday News: గుజరాత్‌లోని సూరత్‌లో చోరీకి ప్రయత్నించిన ఓ దొంగ అనూహ్యంగా గ్రిల్స్‌లో చిక్కుకుపోయిన ఘటన చోటుచేసుకుంది. రాజారాంనగర్ సొసైటీలోని ఓ ఎన్నారై ఇంట్లోకి చోరీ చేసేందుకు దొంగ చొరబడినట్లు సమాచారం.
ఇంట్లోకి ప్రవేశించిన అనంతరం అక్కడి నుంచి బయటకు వెళ్లే క్రమంలో వెనుక వైపు ఏర్పాటు చేసిన గ్రిల్స్‌లో అతడు చిక్కుకున్నాడు. అటు వెళ్లలేక.. ఇటు బయటకు రాలేక కొంతసేపు గ్రిల్స్‌లోనే చిక్కుకుపోయి ఇబ్బందులు పడ్డాడు.
దొంగ గ్రిల్స్‌లో చిక్కుకుపోయిన విషయాన్ని గమనించిన స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అతడిపై కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అయితే ఈ ఘటనలో తన ఇంట్లో ఎలాంటి వస్తువులు చోరీకి గురికాలేదని ఇంటి యజమాని స్పష్టం చేసినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.