BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 10:35 am
Posted by : NUNE SRIKANTH

బోర్‌వెల్ అనుమతులకు కొత్త విధానం.. ఇతర మార్గాల్లో వచ్చిన దరఖాస్తుల తిరస్కరణ

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
17 Nov, 2026 - 10:35 AM
42 వీక్షణలు

వ్యవసాయ, గృహ అవసరాల బోర్లకు మార్గదర్శకాలు జారీ.. జిల్లా భూగర్భ జల శాఖ అధికారులకు ఆదేశాలు

తెలంగాణ | ఎన్ టుడే న్యూస్

రాష్ట్రంలో వ్యవసాయ, గృహ అవసరాల కోసం బోర్‌వెల్ తవ్వకాలకు అనుమతులు పొందాలనుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు సమాచారం. బోర్‌వెల్ తవ్వకాలకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకునే విధానంలో మార్పులు చేస్తూ కీలక మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

కొత్త విధానం ప్రకారం బోర్‌వెల్ తవ్వకాలకు అనుమతి కోసం దరఖాస్తులను మీ సేవ కేంద్రాల ద్వారానే సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో నేరుగా లేదా పోస్టల్ ద్వారా, ఇతర మార్గాల్లో సమర్పించే దరఖాస్తులను స్వీకరించకుండా తిరస్కరించాలని భూగర్భ జల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

ఈ మార్గదర్శకాలను జిల్లా స్థాయిలో అమలు చేయాలని సంబంధిత భూగర్భ జల శాఖ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. అయితే కొత్త విధానం అమలుకు సంబంధించిన పూర్తి వివరాలు, దరఖాస్తుకు అవసరమైన పత్రాలు, అనుమతుల ప్రక్రియపై అధికారిక ఉత్తర్వుల ద్వారా మరింత స్పష్టత రావాల్సి ఉంది.