BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 07:31 pm
Posted by : SEETHA KIRAN KUMAR

జనన, మరణాల ఆలస్య నమోదుపై కొత్త నిబంధనలు

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
08 Nov, 2026 - 07:31 PM
12 వీక్షణలు

ఏడాది దాటితే మేజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి.. రెండేళ్లు దాటితే ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు అవసరం

న్యూఢిల్లీ (ఎన్ టుడే న్యూస్): జనన, మరణాల నమోదు ప్రక్రియలో పారదర్శకత పెంచడంతోపాటు ఆలస్యంగా నమోదు చేసే సందర్భాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చట్ట సవరణ తీసుకొచ్చింది. 1969 నాటి జనన, మరణాల నమోదు చట్టంలోని సెక్షన్ 13ను సవరిస్తూ ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ (అమెండ్‌మెంట్) యాక్ట్–2026’ను ఆగస్టు 6న అధికారిక గెజిట్‌లో ప్రచురించింది. ఈ సవరణలు 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

కొత్త నిబంధనల ప్రకారం.. జననం లేదా మరణం జరిగిన ఏడాది తర్వాత, రెండేళ్లలోపు నమోదు చేయించాలంటే సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్ (DM), సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) లేదా జిల్లా మేజిస్ట్రేట్ అధికారం ఇచ్చిన కార్యనిర్వాహక మేజిస్ట్రేట్ నుంచి ఉత్తర్వులు పొందాలి. సంబంధిత అధికారి జననం లేదా మరణానికి సంబంధించిన వివరాల వాస్తవికతను పరిశీలించిన తర్వాతే అనుమతి జారీ చేయాల్సి ఉంటుంది. నిర్ణీత రుసుము చెల్లించిన అనంతరం రిజిస్ట్రార్ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తారు.

జననం లేదా మరణం జరిగి రెండేళ్లు దాటిన తర్వాత నమోదు చేయించాలంటే సంబంధిత ప్రాంత పరిధిలోని ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నుంచి ఉత్తర్వులు తప్పనిసరి. సమర్పించిన వివరాల వాస్తవికతను పరిశీలించి, నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాతే నమోదు ప్రక్రియకు అనుమతి లభిస్తుంది.

గతంలో ఏడాది దాటిన తర్వాత ఆలస్య నమోదుకు జిల్లా మేజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ లేదా అధీకృత కార్యనిర్వాహక మేజిస్ట్రేట్ ఉత్తర్వులు అవసరమయ్యేవి. తాజా సవరణతో రెండేళ్లు దాటిన కేసులకు ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆదేశాలను తప్పనిసరి చేశారు.

ఆధార్ నమోదు, విద్యా ప్రవేశాలు, ఆస్తుల బదలాయింపు, వారసత్వ హక్కులు, బీమా క్లెయిమ్‌లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు జనన, మరణ ధ్రువపత్రాలు కీలక ఆధారాలుగా ఉంటాయి. అందువల్ల జననం లేదా మరణం సంభవించిన వెంటనే సంబంధిత స్థానిక సంస్థల్లో నమోదు చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను నివారించుకోవచ్చు.