BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 03:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పశ్చిమ బెంగాల్‌లో దారుణం.. భార్య తల నరికి ఆలయంలో కూర్చున్న భర్త

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Nov, 2026 - 03:50 PM
56 వీక్షణలు

పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా గంగారాంపూర్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. భార్యను హత్య చేయడమే కాకుండా ఆమె తలను నరికి, దానిని చేతిలో పట్టుకుని స్థానిక కాళీమాత ఆలయ ప్రాంగణంలో కూర్చున్న భర్త ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. గంగారాంపూర్‌కు చెందిన రింటూ ఘోష్ (46)కు 15 ఏళ్ల క్రితం సీమా సర్కార్‌తో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రింటూ గతంలో బస్సు కండక్టర్‌గా పనిచేసేవాడు. అయితే కొంతకాలం క్రితం ఉద్యోగం మానేయడంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆగ్రహానికి గురైన రింటూ భార్యను హత్య చేసి, ఆమె తలను వేరు చేసినట్లు సమాచారం. అనంతరం భార్య తలను తీసుకుని స్థానిక కాళీమాత ఆలయ ప్రాంగణానికి చేరుకుని అక్కడే కూర్చున్నాడు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రింటూ ఘోష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదాలే హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.