BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 13 February 2026, 03:41 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఉమా కుక్కుటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ

తెలంగాణ
13 Feb, 2026 - 03:41 AM
357 వీక్షణలు
ఉమా కుక్కుటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ NTODAY NEWS: కాకినాడ జిల్లా, గొల్లప్రోలు ప్రతినిధి బోర శివారెడ్డి  పిఠాపురం : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పిఠాపురం పాదగయ క్షేత్రంలోని స్వయంభూ శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యుడు కొణిదెల పవన్ కళ్యాణ్ తరఫున ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఓదూరి కిషోర్, పిఠాపురం పట్టణ ఇంచార్జ్ డా. చిక్కాల వరలక్ష్మి రమణారావు తదితరులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య, మంగళవాయిద్యాలతో సాయంత్రం నిర్వహించిన దివ్య కళ్యాణ మహోత్సవంలో ఈ సమర్పణ జరిగింది. కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ, భక్తుల సౌకర్యార్థం పాదగయ క్షేత్రంలో కోనేరు పరిశుభ్రత, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. మహాశివరాత్రి సందర్భంగా అంకురార్పణతో ప్రారంభమైన ఉత్సవాలు వారం రోజుల పాటు కొనసాగనున్నాయని, నిత్య కళ్యాణాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విఐపీ దర్శనాలు ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం మాత్రమే నిర్వహిస్తామని, సాధారణ భక్తులకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 20 మంది సభ్యులతో ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. #Pithapuram #KakinadaDistrict #UmaKukkuteswaraSwamy #MahaShivaratri #JanasenaParty #TempleNews Follow us on Website Facebook Instagram YouTube