BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 16 April 2025, 05:20 am
Posted by : NTODAY NEWS OFFICIAL

అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి

తెలంగాణ
16 Apr, 2025 - 05:20 AM
432 వీక్షణలు
అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి--భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, ఏప్రిల్16 :-ఇప్పలపల్లి నరేందర్ జాయింట్ నల్గొండ జిల్లా బ్యూరో బుధవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన దిశ సమావేశానికి ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంత రావు, రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం పార్లమెంట్ సభ్యులు వివిధ శాఖల అభివృద్ధి పనుల సంబంధించిన పలు అంశాలపై అధికారులతో క్షుణ్ణంగా చర్చించి సమీక్షించారు. భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చే సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు మరింతగా కృషి చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ దిశ ప్రాముఖ్యతను గుర్తించి సమావేశంలో ప్రతిపాదించిన, చర్చించిన, పరిష్కార విషయాలను ప్రతి మూడు మాసాలకు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. జాతీయ రహదారుల రంగంలో పనులు వేగవంతం అయ్యేలా తగిన చర్యలు చేపట్టాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు.కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్న పథకాలు , వాటి ఇంప్లిమెంటేషన్ , వాటిలో జరుగుతున్న కార్యక్రమాల మీద అవగాహన తీసుకోవడం జరిగింది. ఈ దిశ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్న నిధులు సంబంధిత శాఖలు ఎలా ఖర్చు చేస్తున్నారు, అవి ప్రజలకు గ్రౌండింగ్ అయితున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. స్థానిక శాసనసభ్యులకు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు మాత్రమే ఎక్కువగా అవగాహన ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ విషయాలను పార్లమెంట్లో సెంట్రల్ మినిస్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు. కింద ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులతో ఏం చేస్తే బాగుంటది ఏ పథకానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అని తెలుసుకొని ఆ పథకానికి ఎక్కువ నిధులు కేంద్రం నుండి తేవడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. కేంద్ర పథకాల గురించి ప్రజలకు అవగాహన కలిగించేలా సంబంధిత అధికారులు లబ్ధిదారులకు అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించాలని ఎంపీ కోరారు.ఈ సమావేశంలో జెడ్పి సీఈవో శోభారాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, సంబంధిత శాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube