టీకాల కార్యక్రమం తీరుపై అధికారుల ఆకస్మిక తనిఖీ
NTODAY NEWS: చిట్యాల
నల్లగొండ జిల్లా చిట్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న, వనిపాకల గ్రామంలోని సబ్ సెంటర్, శివనేని గూడెం ఔట్‌రీచ్ సెషన్‌ను డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాహుల్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఆయన వెంట నల్గొండ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగేష్, హెచ్‌ఈఈఓ అంజయ్య గౌడ్ ఉన్నారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఇమ్యూనైజేషన్ కార్యక్రమాన్ని అధికారులు పరిశీలించారు. టీకాల కార్యక్రమానికి సంబంధించిన రికార్డులు, రిజిస్టర్లను తనిఖీ చేసి వివరాలను పరిశీలించారు. రికార్డులు, రిజిస్టర్లను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని, టీకాల కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని అధికారులు సిబ్బందికి సూచించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.