BREAKING
thumb శాప్ ఘటనపై బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు thumb బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక thumb ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తులు thumb నవంబరు నుంచి వాడపల్లిలో తిరునామం ఉచితమే thumb కమనీయంగా కళ్యాణ మహోత్సవం thumb భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం thumb వాగుపై వంతెన నిర్మించాలని ఏడుగురాళ్లపల్లి ప్రజల డిమాండ్ thumb గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన thumb శాప్ ఘటనపై బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు thumb బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక thumb ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తులు thumb నవంబరు నుంచి వాడపల్లిలో తిరునామం ఉచితమే thumb కమనీయంగా కళ్యాణ మహోత్సవం thumb భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం thumb వాగుపై వంతెన నిర్మించాలని ఏడుగురాళ్లపల్లి ప్రజల డిమాండ్ thumb గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన
Date of Publish : 09 August 2026, 10:41 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఒక గంటలో నీ అల్లుడ్ని ఎగిరిస్తా... చూస్తావా?” అంటూ అత్తకు బెదిరింపులు?...

ఆంధ్రప్రదేశ్
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
09 Aug, 2026 - 10:41 AM
41 వీక్షణలు

ఒక గంటలో నీ అల్లుడ్ని ఎగిరిస్తా... చూస్తావా?” అంటూ అత్తకు బెదిరింపులు?...

అన్నమయ్య జిల్లా,

పుంగనూరు నియోజకవర్గం,

చౌడేపల్లి మండలం.

ఎవరు పిటీషన్ పెట్టినా... నింద అతని పైనే నెట్టడమేనా..? 

గోప్యత విధానం పాటించని పోలీసుల పై చర్యలు తీసుకోండి

చౌడేపల్లి మండలంలోని ఓ గ్రామంలో మైనర్ బాలిక అదృశ్యమైన ఘటనపై నమోదైన మిస్సింగ్ కేసు అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.వివరాల ప్రకారం.. మైనర్ బాలిక తన ప్రియుడితో వెళ్లిపోయినట్లు సమాచారం అందడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.అనంతరం బాలికను గుర్తించి, తల్లిదండ్రుల సమక్షంలో సీడీసీకి అప్పగించినట్లు తెలుస్తోంది.అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలపై స్పష్టత రావాల్సి ఉంది.ఈ వ్యవహారంపై ఎవరో మానవ హక్కుల సంస్థకు ఫిర్యాదు చేశారని,అందులో జేమ్స్(పేరు మార్చబడినది)ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పినట్లు బాలిక తండ్రి పేర్కొన్నట్లు సమాచారం.దీంతో జేమ్స్ అత్త (అనిత పేరు మార్చడమైనది)ను బాలిక తండ్రి బెదిరించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. “ఒక గంటలో నీ అల్లుడ్ని ఎగిరిస్తా... చూస్తావా?” అంటూ బెదిరించినట్లు వారి అత్త ఆరోపించినట్లు సమాచారం.ఈ ఘటన గ్రామంలోని ఓ పెద్దమనిషి (సోమన్న పేరు మార్చడమైనది)సమక్షంలో చోటుచేసుకున్నట్లు, అక్కడికి వచ్చిన పోలీసులు కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు సదరు పెద్దమనిషి వెల్లడించినట్లు సమాచారం.ఏదైనా సమాచారం అందిస్తే పోలీసలు గోప్యతా విధానం పాటించాల్సిన అవసరం ఉందా? లేదా? ఐతే ఎవరో చేసిన పనిని ఇంకో వ్యక్తి పైకి నెట్టిన పోలీసల పై తక్షణ చర్యలు తీసుకోవాలని సదరు వ్యక్తి డిమాండ్ చేశారు.ఈ విషయాన్ని ఇతటితో ఆపేది లేదని,సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం అన్ని ఆధారాలు సేకరించి ఉన్నతాధికారులకు పిర్యాదు చేయనున్నట్లు సదరు వ్యక్తి తెలియజేశారు.

ఎస్సైని సంప్రదించిన సదరు వ్యక్తి 

ఈ విషయంపై సదరు వ్యక్తి వెంటనే చౌడేపల్లి ఎస్సైను చరవాణిలో సంప్రదించినట్లు తెలిపారు.తన పేరు ఎవరు చెప్పారని,ఇంతకు ప్రశ్నించగా, “ఏదో మానవ హక్కుల సమితి పేరుతో వచ్చింది” అని ఎస్సై తెలిపినట్లు సదరు వ్యక్తి పేర్కొన్నారు.అయితే మైనర్ బాలిక విషయంలో ఎవరు ఫిర్యాదు చేశారు? పోలీసులకు అసలు సమాచారం ఎలా చేరింది? ఆ వ్యక్తి పేరు ఎందుకు ప్రస్తావనకు వచ్చింది? అనే ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి.

సమగ్ర విచారణకు డిమాండ్

ఈ వ్యవహారంలో మైనర్ బాలిక కుటుంబ సభ్యుల ఆరోపణలు,పోలీసుల వివరణ,అలాగే ఫిర్యాదు చేసిన వ్యక్తి లేదా సంస్థ వివరాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.అదేవిధంగా బెదిరింపుల ఆరోపణలపై కూడా విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ఇదేనా పోలీసుల పని తీరు ఈ విషయాన్ని సోమవారం లోపల పరిష్కారం చేయకపోతే సోమవారం జిల్లా ఎస్పి ని కలసి సదరు పోలీసుల పైన పిర్యాదు చేయనున్నట్లు సదరు వ్యక్తి తెలియజేశారు. అంతే కాకుండా బెధిరించిన వ్యక్తి కులదృవీకరణ పత్రం పైన కూడా పలు అనుమానాలు ఉన్నాయని సంబందించిన రెవిన్యూ అధికారులకు పిర్యాదు చేయనున్నట్లు తెలియజేశారు.