BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 30 June 2026, 07:06 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

Punganur: సర్ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్‌పై టీడీపీ సమావేశం.. 14 రోజులు అప్రమత్తంగా ఉండాలి: చల్లా బాబురెడ్డి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
30 Jun, 2026 - 07:06 AM
101 వీక్షణలు

అన్నమయ్య జిల్లా | NTODAY NEWS

అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని ట్రావెల్స్ బంగ్లాలో సోమవారం సర్ (Special Intensive Revision) ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కార్యక్రమంపై రూరల్, అర్బన్ క్లస్టర్‌లు, యూనిట్ ఇన్‌చార్జులు, తెలుగుదేశం పార్టీ నాయకులతో పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి శ్రీ చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబురెడ్డి) సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా చల్లా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, రాబోయే 14 రోజుల పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని సూచించారు.

ప్రభుత్వం నియమించిన బీఎల్‌ఏలతో (BLA) సమన్వయం చేసుకుంటూ ప్రతి నాయకుడు, కార్యకర్త ఓటర్ల వివరాల పరిశీలనలో భాగస్వాములు కావాలని కోరారు. బీఎల్‌ఏలు సక్రమంగా విధులు నిర్వహించకపోతే వారి వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి 24 గంటల్లో చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని హెచ్చరించారు.

సమావేశం అనంతరం అధికారులు, పార్టీ నాయకులతో కలిసి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.