BREAKING
రామన్నపేటలో చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం ఉరుమడ్ల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి రామన్నపేటలో చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం ఉరుమడ్ల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి
Date of Publish : 27 July 2026, 11:24 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఊటుకూరు కోదండరామస్వామి ఆలయంలో శాకాంబరి అలంకరణ వైభవం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jul, 2026 - 11:24 AM
98 వీక్షణలు

ఊటుకూరు కోదండరామస్వామి ఆలయంలో శాకాంబరి అలంకరణ వైభవం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా సోమవారం శాకాంబరి ఉత్సవం వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కోదండరామస్వామిని మల్లెపూలతో ప్రత్యేకంగా అలంకరించగా, రాజ్యలక్ష్మి, గోదాదేవి అమ్మవార్లకు బెండకాయ, దొండకాయ, వంకాయ, చిక్కుడు, క్యారెట్, బీట్‌రూట్, సొరకాయ, గుమ్మడికాయ, కాప్సికం, వివిధ ఆకుకూరలతో శాకాంబరి అలంకరణ చేశారు. ఆలయం వెలుపల కూడా కూరగాయల దండలతో సుందరంగా అలంకరించి భక్తులను ఆకట్టుకున్నారు.

ఆలయ ప్రధాన అర్చకుడు లక్ష్మీ శ్రీనివాస సూరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు హరేరామ నామసంకీర్తనతో పాటు విష్ణు, లలిత పారాయణాలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారు, అమ్మవార్ల దర్శనం చేసుకుని కదంబం ప్రసాదాన్ని స్వీకరించారు.

ఉత్సవ ఏర్పాట్లను ఆలయ కమిటీ చైర్మన్ పద్మనాభుని సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో సభ్యులు చెరుకూరి చిట్టెమ్మ, చావా శ్రీనివాసరావు, జక్కుల కృష్ణ, తమ్మిశెట్టి నాగరాజు, జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు, గుంతా కిషోర్, ముత్యాల నాగేంద్రరావు, జిక్కుల నరసింహారావు పర్యవేక్షించారు.