BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 26 July 2025, 08:30 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మాదిగ దండోరా జెండా-- అణగారిన వర్గాలకి అండ...

తెలంగాణ
26 Jul, 2025 - 08:30 AM
547 వీక్షణలు
మాదిగ దండోరా జెండా, అణగారిన వర్గాలకి అండ – ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షులు హరిగోపాల్ మాదిగ NTODAY NEWS: కూడేరు జులై.26 78 ఏండ్ల స్వాతంత్య్ర భారతదేశంలో 30 ఏండ్లుగా సజీవంగా నిలబడి లక్ష్యాన్ని ముద్దాడిన ఏకైక సామాజిక ఉద్యమం ఎమ్మార్పీఎస్‌ మాత్రమే అని, ఈ 30 ఏండ్ల కాలంలో దండోరా జెండా సమస్త పీడిత అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షులు హరిగోపాల్ మాదిగ,మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు బండారు కదిరప్ప మాదిగలు అన్నారు. స్థానిక కరుట్లపల్లి ఎస్సీ కాలనీలో ఎమ్మార్పిఎస్ దండోరా జెండాను వారు ఆవిష్కరణ చేశారు.ఎమ్మార్పీఎస్‌ పట్టణ సదస్సులో వారు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్‌ ఉద్యమం ఆవిర్భవించిన తరువాత, మందకృష్ణ తన పేరు పక్కన మాదిగ అని చేర్చుకున్న తరువాత మాదిగ సమాజానికి ఎనలేని దైర్యం కలిగిందన్నారు. ఆ దైర్యంతోనే మాదిగలంతా తమ పేరు పక్కన కులం పేరు చేర్చుకొని ఆత్మ గౌరవాన్ని చాటుకున్నారని తెలిపారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన అందక పోవడం వల్లనే మాదిగలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారన్నారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించాలని మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 30ఏండ్లు రాజీలేని పోరాటం సాగిందని అన్నారు. ఆ పోరాట ఫలితంగానే నేడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చట్టం అమలులోకి వచ్చిందని, దాని ద్వారా మాదిగలకు 9శాతం రిజర్వేషన్లు దక్కుతాయన్నారు.ఈ నేపథ్యంలో జూలై 7న జరిగిన ఎమ్మార్పీఎస్‌ 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకొని ప్రతి గ్రామంలో దండోరా జెండా ఆవిష్కరణలు చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ సీనియర్ జిల్లా నాయకులు రాజు, లక్ష్మన్న, కరుట్లపల్లి మాజీ సర్పంచ్ రామాంజనేయులు, మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ మాదిగ, కమ్మూరు గణేష్, విహెచ్పిఎస్ కలగళ్ల ముత్యాలు, ఎంఎస్పి సత్యమయ్య మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube