BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 28 August 2026, 02:56 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పాలకుర్తిలో గోమాతలకు రాఖీలు కట్టిన కుటుంబం.....

తెలంగాణ
/ జనగామ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 02:56 PM
76 వీక్షణలు

పాలకుర్తిలో గోమాతలకు రాఖీలు కట్టిన కుటుంబం.. జీవకారుణ్యంతో వినూత్న రక్షాబంధన్ వేడుకలు

జనగామ జిల్లా పాలకుర్తి:

రక్షాబంధన్ పండుగను వినూత్నంగా నిర్వహిస్తూ పాలకుర్తి మండల కేంద్రంలోని గోశాలలో ఓ కుటుంబం గోమాతలపై తమ ప్రేమాభిమానాలను చాటుకుంది. సాధారణంగా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య జరిగే రాఖీ వేడుకలను గోవులతో నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు.

అర్చకుల వేదమంత్రాల నడుమ గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవగిరి భార్గవి గోమాతలకు తిలకం దిద్ది, రాఖీలు కట్టి భక్తిశ్రద్ధలతో వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం గోవులకు దీపహారతి ఇచ్చి పూజలు చేశారు.

రక్షాబంధన్ సందర్భంగా స్వీట్లకు బదులుగా గోవులకు అరటిపండ్లు, ఆకుకూరలతో విందు ఏర్పాటు చేశారు. గోవులను కేవలం పెంపుడు జంతువులుగా కాకుండా కుటుంబ సభ్యులుగా భావిస్తూ ఈ వేడుకలు నిర్వహించడం పలువురిని ఆకట్టుకుంది.

మూగజీవుల పట్ల ప్రేమ, కరుణను చాటుతూ సంప్రదాయానికి జీవకారుణ్యాన్ని జోడించిన ఈ వినూత్న రక్షాబంధన్ వేడుకలు పాలకుర్తిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గోమాతలతో నిర్వహించిన ఈ వేడుకలు స్థానికుల ప్రశంసలు అందుకున్నాయి.