BREAKING
thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ
Date of Publish : 16 August 2026, 06:37 pm
Posted by : కూనురు మధు

పారిశ్రామిక రసాయనాల అక్రమ విక్రయం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
16 Aug, 2026 - 06:37 PM
385 వీక్షణలు

పారిశ్రామిక రసాయనాల అక్రమ విక్రయం : ఐదుగురు నిందితుల అరెస్ట్

పారిశ్రామిక రసాయనాలు అయిన సాల్వెంట్లు, ఐసో ప్రొపైల్ ఆల్కహాల్, మిథనాల్ తదితర కెమికల్స్  అక్రమంగా దారి మళ్లించి అధిక ధరలకు విక్రయిస్తున్న ఒక ముఠాను చిట్యాల పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి వాహనాలు, కెమికల్ డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నట్లు నార్కట్‌పల్లి సర్కిల్ ఇన్స్‌పెక్టర్  సిరికొండ సురేష్ వెల్లడించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం ​చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని వెలిమినేడు గ్రామ శివారులో గల రాజస్థాన్ దాబా వెనుక భాగంలో ఆగస్టు 15 శనివారం  అనుమానాస్పదంగా నిలిపిన వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. ట్యాంకర్ లారీలలో రవాణా అవుతున్న పారిశ్రామిక రసాయనాలను గమ్యస్థానానికి పూర్తిగా చేర్చకుండా, కొంత భాగాన్ని అక్రమంగా బయటకు తీసి డ్రమ్ములలో నిల్వ చేసి ఇతరులకు విక్రయిస్తున్నట్లు విచారణలో గుర్తించామన్నారు. ​ప్రధాన నిందితుడు బాపల సత్యనారాయణ అలియాస్ సతీష్ తన సహచరులతో కలిసి జాతీయ రహదారి-65 పై ప్రయాణించే రసాయన ట్యాంకర్ డ్రైవర్లతో కుమ్మక్కై ట్యాంకర్లలోని సాల్వెంట్లు, ఇతర రసాయనాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి, ప్లాస్టిక్ డ్రమ్ములలో నిల్వ చేసి హైదరాబాద్ మరియు ఇతర ప్రాంతాలకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమ లాభాలు పొందుతున్నట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. అక్రమ దందాలు అరెస్ట్ అయిన వారిలో ​బాపల సత్యనారాయణ అలియాస్ సతీష్ (32), దీపిన్ కుమార్ యాదవ్ (35) ​నవీన్ కుమార్ (31) 

​రాకేష్ ప్రసాద్ (45)  

​అమిత్ కుమార్ (36)  ఉన్నారు వీరి వద్దనుండి రెండు ​బొలేరో  వాహనాలు , ఒక మినీ డీసీఎం , రెండు కెమికల్ టాంకర్లతో పాటు  పారిశ్రామిక రసాయనాలతో నింపబడిన ప్లాస్టిక్ డ్రమ్ములు, పైపులు, ఇన్వాయిసులు, రవాణా పత్రాలు మరియు ఇతర రికార్డులు. స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. ​అక్రమ రవాణా ద్వారా సంబంధిత పరిశ్రమలకు ఆర్థిక నష్టం కలిగించినందుకు గానూ నిందితులపై కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. ఈ అక్రమ రవాణా మరియు విక్రయాల వెనుక మరికొంత మంది వ్యక్తుల ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని సీఐ సురేష్ తెలిపారు.