BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

పార్టీ నిర్మాణ కమిటీల్లో నిబద్ధత కలిగిన కార్యకర్తలకు ప్రాధాన్యం – సీరివేలు గంగాధర్ (చిన్నా)

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
30 Jun, 2026 - 06:12 PM
44 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు, జూన్ 30: నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సీరివేలు గంగాధర్ (చిన్నా) మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమావేశానికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకు జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో జనసేన పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత పటిష్టంగా నిర్మించాలనే లక్ష్యంతో పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ నిర్మాణ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రాజంపేట పార్లమెంట్ పరిధిలో పార్టీ నిర్మాణ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల కమిటీ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ కె.కె. గారిని అబ్జర్వర్‌గా నియమించినట్లు వెల్లడించారు.

రాజంపేట పార్లమెంట్ పరిధిలో మొత్తం 27 మంది నిర్మాణ సారథులతో పాటు ఐటీ విభాగం నుంచి మరో ఇద్దరిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన ఉద్యమకారులు, సాధకులు, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న కార్యకర్తలు, వీర మహిళలకు ఈ కమిటీల్లో సముచిత స్థానం కల్పించేలా పార్టీ అధిష్ఠానం ప్రత్యేక అవకాశం కల్పించిందన్నారు.

గ్రామ, మండల, నియోజకవర్గ, పార్లమెంట్ స్థాయిలలో నాలుగు రకాల కమిటీలకు సంబంధించిన దరఖాస్తులు రాజంపేట పార్లమెంట్ పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పార్టీ సభ్యత్వ గుర్తింపు కార్డు, ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్‌తో పార్టీ కార్యాలయానికి వచ్చి సంబంధిత దరఖాస్తును పూర్తి చేయాలని సూచించారు.

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిశీలన కమిటీలు దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అబ్జర్వర్ శ్రీ కె.కె. గారి ఆమోదంతో పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించడం జరుగుతుందని, తుది నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా తీసుకుంటారని పేర్కొన్నారు.

పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఉద్యమకారుడు, సాధకుడు, వీర మహిళ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ అభివృద్ధికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభించేలా జనసేన పార్టీ పారదర్శక విధానంలో కమిటీలను ఏర్పాటు చేస్తుందని సీరివేలు గంగాధర్ (చిన్నా) స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు...