BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 27 July 2026, 04:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పాఠశాల విద్యార్థులకు భూసార పరిరక్షణపై శిక్షణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jul, 2026 - 04:32 PM
75 వీక్షణలు

పాఠశాల విద్యార్థులకు భూసార పరిరక్షణపై శిక్షణ

తిరువూరు, జూలై 27: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు జెడ్పీహెచ్‌ఎస్, ఏపీఎస్‌డబ్ల్యూఆర్ పాఠశాలల్లో సోమవారం పాఠశాల స్థాయి భూసార పరిరక్షణ పథకం కింద భూసార పరీక్షా కేంద్రం గొల్లపూడి బృందం విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించింది.

ఈ సందర్భంగా భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిణి మేడా సువర్ణ కుమారి మాట్లాడుతూ, విద్యార్థులు నేల ఆరోగ్యం, స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి పాఠశాలలో ప్రభుత్వం మినీ సాయిల్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేస్తోందని తెలిపారు. విద్యార్థులు రైతుల పొలాల నుంచి మట్టి నమూనాలను సేకరించి విశ్లేషణ చేసి, నేలలోని పోషకాల స్థాయిని రైతులకు వివరించి, అవసరమైన ఎరువుల వినియోగంపై సూచనలు అందించాలని చెప్పారు.

భూసార పరీక్షా కేంద్ర వ్యవసాయ అధికారి ప్రియాంక మట్టి నమూనాల సేకరణ విధానం, సాయిల్ హెల్త్ కార్డ్ యాప్ వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సురేష్, మండల వ్యవసాయ అధికారిణి పి. పద్మ, ప్రధానోపాధ్యాయులు బి. మృదుల, ఎస్. రవిబాబు, విస్తరణ అధికారి సురేష్, కావ్య సింధు, రైతు సేవా కేంద్ర సహాయకురాలు భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయులు ధనలక్ష్మి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.