BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 22 May 2026, 07:52 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పచ్చిరొట్ట ఎరువులతో భూమి సారాన్ని పెంచాలి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 May, 2026 - 07:52 AM
204 వీక్షణలు

పచ్చిరొట్ట ఎరువులతో భూమి సారాన్ని పెంచాలి

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని రైతులు వరి, మొక్కజొన్న పంటల కోతల అనంతరం పచ్చిరొట్ట ఎరువుల సాగు చేపట్టి భూమిని సారవంతం చేయాలని మండల వ్యవసాయాధికారి బి. శివశంకర్ సూచించారు. జీలుగ, జనుము, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట పంటలను సాగు చేయడం ద్వారా భూమిలో నత్రజని స్థాపితం అవుతుందని తెలిపారు. నవధాన్యాల సాగు విధానంలో లెగ్యుమినేసి జాతి మొక్కలు భూమి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.

ఈ పంటలను పూత దశలో కలియదున్నడం వల్ల నెల రోజుల్లోనే సేంద్రియ కర్బన పదార్థం పెరిగి, భూమిలో సూక్ష్మజీవుల వృద్ధి రేటు అధికమవుతుందని వివరించారు. దీంతో భూమి సారం పెరిగి తదుపరి పంటలకు అధిక దిగుబడులు లభించే అవకాశం ఉంటుందని తెలిపారు.

ప్రస్తుతం మండలంలోని 13 రైతు సేవ కేంద్రాలలో 296 క్వింటాళ్ల జీలుగ, 54 క్వింటాళ్ల జనుము, 33 క్వింటాళ్ల పిల్లి పెసర విత్తనాలను రైతులకు 50 శాతం రాయితీపై అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. రైతులు పచ్చిరొట్ట సాగు చేపట్టి భూతల్లిని కాపాడుకోవడంతో పాటు ప్రకృతి వ్యవసాయంపై మక్కువ చూపాలని కోరారు.

ఈ సందర్భంగా చాట్రాయి రైతు సేవ కేంద్రం వద్ద రైతులకు పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను 50 శాతం రాయితీపై పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బసవారెడ్డి, జగన్ లు మాట్లాడుతూ పచ్చిరొట్ట ఎరువుల సాగు వల్ల భూమి సారం పెరిగి రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.