BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 30 April 2026, 07:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులకు ఘన వీడ్కోలు

ఆంధ్రప్రదేశ్
/ తూర్పు గోదావరి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 07:25 PM
125 వీక్షణలు

పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులకు ఘన వీడ్కోలు

తూర్పు గోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ హాజరై, పదవీ విరమణ పొందిన అధికారులను సత్కరించారు.

పదవీ విరమణ పొందిన అధికారుల్లో డి. పోలరాజు (ఎస్సై – 2 టౌన్ పోలీస్ స్టేషన్), ఎల్. కనకరాజు (ఎస్సై – డి.సి.ఆర్.బి), సి.హెచ్. శ్రీనివాస్ (ఏఎస్ఐ – 3 టౌన్ పోలీస్ స్టేషన్), డి. విజయరావు (ఏఆర్ హెడ్ కానిస్టేబుల్) ఉన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పదవీ విరమణ పొందిన అధికారులు సుమారు నాలుగు దశాబ్దాల పాటు క్రమశిక్షణ, అంకితభావంతో మచ్చలేని సేవలు అందించారని కొనియాడారు. పోలీస్ విధుల్లో వ్యక్తిగత జీవితాన్ని పక్కనబెట్టి ప్రజల సేవకు ప్రాధాన్యత ఇచ్చిన వారి సేవలు ఆదర్శప్రాయమన్నారు. అలాగే వారి కుటుంబ సభ్యుల సహకారాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

పదవీ విరమణ అనంతరం కూడా వ్యక్తిగత లేదా శాఖాపరమైన సమస్యలు ఎదురైనా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం అధికారులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో బి. రామకృష్ణ (ఎస్‌బి డిఎస్పి), ఏ. శివప్రియ (సౌత్ జోన్ డిఎస్పి)తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.