BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 13 July 2026, 11:25 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో ఘనంగా నామా సత్యనారాయణ మూడో వర్ధంతి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jul, 2026 - 11:25 AM
290 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో మాజీ ఎన్ఎస్పీ డీసీ చైర్మన్ నామా సత్యనారాయణ మూడో వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నామా సత్యనారాయణ విగ్రహానికి గ్రామ ప్రముఖులు, టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన స్మారక సభకు సాయిబాబా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు అధ్యక్షత వహించారు.

సభలో వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ, నామా సత్యనారాయణ రాజకీయాలకు అతీతంగా సేవలందించారని, తనకు ఓటు వేయని కుటుంబాలకు కూడా ఇళ్లను మంజూరు చేయించి ప్రజాభిమానాన్ని చాటుకున్నారని గుర్తు చేశారు.

మాజీ సర్పంచి సంగెపు నారాయణ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధిలో నామా సత్యనారాయణ నాలుగు దశాబ్దాల పాటు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. గ్రామ టీడీపీ అధ్యక్షుడు బొలగాని కోటేశ్వరరావు మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా నామా సత్యనారాయణ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.

ఈ కార్యక్రమంలో చింతలనర్వ మాజీ సర్పంచి యనమద్ది మల్లేశ్వరరావు, కొండపల్లి మురళి, విశ్రాంత బ్యాంక్ మేనేజర్ దేవరపల్లి రమేష్, కోమ్మినేని వెంకటేశ్వరరావు, పంది వెంకట్రావు, నంబూరి శ్రీనివాసరావు, కొండేటి వెంకటప్ప, సంగెపు గాంధీ, యనమద్ది విజయకుమార్, బొలగాని కృష్ణ, మోట్లకట్ల రాజారెడ్డి, మీనుగు కృష్ణ, పంది కృష్ణ, బొలగాని గోపి తదితరులు పాల్గొన్నారు.