BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 13 July 2026, 11:25 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
13 Jul, 2026 - 11:25 AM
95 వీక్షణలు

అన్నమయ్య జిల్లా,పుంగనూరు 

పుంగనూరు పట్టణంలో బి.ఎం. ఎస్. క్లబ్ భవనంలో ఆదివారం పుంగనూరు లయన్స్ క్లబ్ మదనపల్లి లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిం చింది. కంటి సంబంధిత సమస్యలతో బాధపడు తున్న ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఉచితంగా నేత్ర పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహాలను పొందారు. శిబిరంలో ప్రముఖ నేత్ర వైద్యులు రోగులను క్షుణ్ణంగా పరీక్షించి అవసరమైన చికిత్సలు, వైద్య సూచనలు అందించారు. మొత్తం 60 మందికి పైగా రోగులు కంటి పరీక్షలు చేయించుకోగా, వారిలో 18 మంది రోగులను ఉచిత కంటి శస్త్రచికిత్సల కోసం ఎంపిక చేసినట్లు

నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ అంబాసిడర్ డా. శివ మాట్లాడుతూ, పుంగనూరులో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత 23 సంవత్సరాలుగానిరంతరాయంగా సేవా కార్యక్ర మాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా, లయన్స్ క్లబ్ నిర్వహిస్తున్న ఉచిత డయాలసిస్ సెంటర్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన అనేక మంది రోగులకు ఉచిత డయాలసిస్ సేవలు అం దిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల్లో కంటి ఆరోగ్యంపై

అవగాహన పెంపొందించడం, అవసరమైన వారికి నాణ్యమైన వైద్య సేవలను అందించడం లయన్స్ క్లబ్ ముఖ్య లక్ష్యమని ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతినెల రెండో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాలను నిరంతరం నిర్వహిస్తూ మరింత మందికి సేవలందిస్తామనినిర్వాహకులు వెల్లడిం చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మహేందర్రావు, వరదా రెడ్డి, డా. సరళ, కార్యదర్శి మహిపాల్ రెడ్డి, కోశాధికారి సుధాకర్ రావు, సభ్యులు త్రిమూర్తి రెడ్డి, ఇనయ్ తుల్లా షరీఫ్, బాల సుబ్రహ్మణ్యం, అమరావతి సురేష్, రజి అహ్మద్.. లియో క్లబ్ కమిటీ సభ్యులు మహమ్మద్ రాఫీ ఉదయ్, రూపాల్లా, డా. అనిల్ నేతృత్వంలోని వైద్య బృందం పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు.