BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 13 July 2026, 11:25 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎస్ఐఆర్ ప్రక్రియపై ఓటర్ల ఆందోళన.. 2002 ఓటరు జాబితా మ్యాపింగ్‌తో కొత్త చిక్కులు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jul, 2026 - 11:25 AM
129 వీక్షణలు

రాష్ట్రంలో ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై పలుచోట్ల ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2002 ఓటరు జాబితా ఆధారంగా మ్యాపింగ్ చేయాల్సి ఉండటంతో అనేక మంది తమ పాత ఓటరు వివరాలను గుర్తించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. అప్పటి పోలింగ్ కేంద్రం, వార్డు, నియోజకవర్గం వంటి వివరాలు తెలియక గందరగోళానికి గురవుతున్నామని ఓటర్లు పేర్కొంటున్నారు.

పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలు, వ్యాపారాల కారణంగా తరచూ నివాసాలు మార్చుకున్న వారు, కిరాయి ఇళ్లలో నివసించిన వారు 2002లో తమ ఓటు ఎక్కడ నమోదైందో గుర్తించడం కష్టంగా మారిందని అంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడం లేదా వినియోగంలో అనుభవం లేకపోవడంతో వృద్ధులు, సాధారణ ఓటర్లు మరింత ఇబ్బందులు పడుతున్నారని అభిప్రాయపడుతున్నారు.

ఇక బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు) ద్వారా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తిస్థాయిలో జరగలేదని పలువురు ఆరోపిస్తున్నారు. తమకు ఫారాలు అందలేదని, బీఎల్‌ఓ వివరాలు తెలుసుకుని స్వయంగా వెళ్లి ఫారాలు తెచ్చుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు. అయితే ఎన్నికల అధికారులు మాత్రం ఫారాల పంపిణీ దాదాపు పూర్తయిందని వెల్లడిస్తున్నారు.

ఈ నెల 24తో ఎన్యూమరేషన్ ప్రక్రియ గడువు ముగియనున్న నేపథ్యంలో ఇంకా ఫారాలు అందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కొందరు బీఎల్‌ఓలు ఫారం సమర్పించకపోతే ఓటు హక్కుపై ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నట్లు కూడా సమాచారం వెలువడుతోంది.

అయితే అధికారుల వివరణ ప్రకారం, 2002 ఓటరు జాబితాలో మ్యాపింగ్ జరగకపోయినా ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించవచ్చు. అలాంటి దరఖాస్తులను ప్రత్యేకంగా పరిశీలించి, ఎన్నికల సంఘం సూచించిన అంగీకార పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పించాలని సూచిస్తున్నారు. ఆ పత్రాల పరిశీలన అనంతరం అర్హత ఉన్న వారి ఓటు హక్కుపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు. అందుబాటులో ఉంటే 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ చేసుకోవడం ఉత్తమమని కూడా సూచిస్తున్నారు.