BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

విశాఖకు రేపు వైఎస్ జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jul, 2026 - 11:27 AM
68 వీక్షణలు

తాడేపల్లి, జూలై 14: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు.

ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితులను కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడంతో పాటు, పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు. అలాగే అదే ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి బయటపడి చికిత్స పొందుతున్న కారి చిన్నాను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారు.

పర్యటనలో భాగంగా ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అనంతరం జబ్బార్ తోటలో బోటు ప్రమాద బాధిత కుటుంబాలను కలుస్తారు. తర్వాత కారి చిన్నాను పరామర్శించిన అనంతరం మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.

బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఇప్పటికే పార్టీ నాయకులకు సూచించిన వైఎస్ జగన్, ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ప్రతినిధులు రాజులపాటి కళ్యాణి, శివప్రసాద్ దంపతులు తెలిపారు.