BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 12 July 2026, 03:27 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రైలు ప్రయాణికులకు అలర్ట్.. టికెట్ తనిఖీలపై ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jul, 2026 - 03:27 PM
151 వీక్షణలు

రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే కీలక సూచనలు జారీ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసిన టికెట్లు లేదా స్క్రీన్‌షాట్‌లను టికెట్‌గా పరిగణించబోమని స్పష్టం చేసింది. టికెట్లలో మార్పులు (ట్యాంపరింగ్), నకిలీ టికెట్ల వినియోగం, దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

రైల్వే అధికారుల తనిఖీల సమయంలో ఐఆర్‌సీటీసీ యాప్‌లో కనిపించే ఒరిజినల్ ఈ-టికెట్, బుకింగ్ సమయంలో వచ్చిన అసలు కన్ఫర్మేషన్ సందేశం (SMS) లేదా ప్రింటెడ్ టికెట్ మాత్రమే చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. వీటితో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు కూడా తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించింది.

వాట్సాప్ స్క్రీన్‌షాట్ లేదా ఫార్వర్డ్ చేసిన టికెట్ మాత్రమే చూపితే, టికెట్ లేని ప్రయాణికులుగా పరిగణించే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాంటి పరిస్థితుల్లో కొత్త టికెట్ కొనుగోలు చేయడంతో పాటు, రైల్వే నిబంధనల ప్రకారం జరిమానా కూడా చెల్లించాల్సి రావచ్చని తెలిపింది.

అందువల్ల ప్రయాణానికి ముందు టికెట్‌ను ఐఆర్‌సీటీసీ యాప్‌లోనే భద్రంగా ఉంచుకోవడం లేదా ప్రింట్ తీసుకుని వెంట తీసుకెళ్లడం మంచిదని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.