BREAKING
thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు
Date of Publish : 02 August 2026, 11:24 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో ఘనంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Aug, 2026 - 11:24 AM
92 వీక్షణలు

పెనుగొలనులో ఘనంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం, పెనుగొలను గ్రామంలో ఆదివారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఒకరికి ఒకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పరస్పరం మిఠాయిలు తినిపించుకుంటూ స్నేహబంధాన్ని మరింత బలపరిచారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ, నిజమైన స్నేహానికి ప్రతీకగా శ్రీకృష్ణుడు–కుచేలుడు స్నేహాన్ని పేర్కొన్నారు. పేదరికంలో ఉన్న కుచేలుడు ద్వారకకు వచ్చిన విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు స్వయంగా ఎదురెళ్లి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని కన్నీటి పర్యంతమయ్యాడని చెప్పారు. అనంతరం కుచేలుడిని తన సింహాసనంపై కూర్చోబెట్టి స్వయంగా ఆయన పాదాలను కడిగి, ఆ పవిత్ర జలాన్ని తన శిరస్సుపై చల్లుకున్న ఘటన స్నేహానికి అత్యున్నత ఉదాహరణగా నిలిచిందన్నారు.

డబ్బు, హోదా, స్థాయి వంటి వాటికి అతీతంగా నిలిచేది నిజమైన స్నేహమేనని, జీవితాంతం స్నేహాన్ని కాపాడుకోవాలని విద్యార్థులకు సూచించారు. స్నేహితుల దినోత్సవం ఆవిర్భావం, దాని విశిష్టతను వివరించి యువతలో స్నేహం, పరస్పర గౌరవం, సహకార భావన పెంపొందాలని ఆకాంక్షించారు.

అనంతరం సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించి విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.