BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 01 August 2026, 11:44 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో టీడీపీ బహిరంగ సభ

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Aug, 2026 - 11:44 AM
84 వీక్షణలు

పెనుగొలనులో టీడీపీ బహిరంగ సభ

కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై నాయకుల వివరణ.. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భారీ ర్యాలీ

తిరువూరు, ఆగస్టు 1: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో శుక్రవారం రాత్రి "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని బొడ్రాయి సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించి, కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

మండల టీడీపీ అధ్యక్షులు మానుకొండ రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో మాజీ మండలాధ్యక్షుడు యనమద్ది పుల్లయ్య చౌదరి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. అదే సమయంలో రాష్ట్ర అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగుతూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటోందని తెలిపారు.

మండల టీడీపీ నాయకులు రేగళ్ల వీరారెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, సంక్షేమం, పెట్టుబడులు, ఉపాధి వంటి అనేక రంగాల్లో అభివృద్ధి వేగవంతమైందన్నారు. రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా పాలన సాగుతోందని పేర్కొన్నారు.

గ్రామ సహకార సంఘం అధ్యక్షులు నాగళ్ళ మురళి మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు తెలియజేశారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అంతకుముందు గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి బొడ్రాయి సెంటర్ వరకు పార్టీ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు బొలగాని కోటేశ్వరావు, నీటిపారుదల సంఘం అధ్యక్షులు మోటకట్ల రాజారెడ్డి, కొండేటి వెంకటప్పయ్య, తోట నరసింహారావు, మాజీ శాఖా సంఘ అధ్యక్షులు నంబూరి శ్రీనివాసరావు, మండల టీడీపీ నాయకులు దిరిశాల వెంకటకృష్ణారావు, గువ్వల వెంకటేశ్వరరెడ్డి, కోట మున్న, భరత్ కుమార్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.